Site icon NTV Telugu

Minister KTR: ఐ యామ్‌ ఇంప్రెస్‌ .. భవిష్యత్తులో ఇలాగే ఉంటుంది కేటీఆర్‌ ట్వీట్‌

Minister Ktr

Minister Ktr

Minister KTR: రైతుల కోసం క్విట్స్​ అభివృద్ధి చేసిన ట్రాక్టర్​ అందరిని ఆకట్టుకొంటుంది. ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవర్​ అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ఆ ట్రాక్టర్​ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్​లో ఇలాంటి ట్రాక్టర్​లతో తమ పొలం పనులను తామే స్వంతంగా చేసుకొవచ్చునని అంటున్నారు. కాగా.. డ్రైవర్​ ఖర్చులు కూడా మిగులుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని వ‌రంగ‌ల్‌కు చెందిన కాక‌తీయ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సైన్సెస్‌(కేఐటీఎస్‌) ఇటీవ‌ల డ్రైవ‌ర్‌లెస్ ఆటోన‌మ‌స్ ట్రాక్టర్‌ ను డెవ‌ల‌ప్ చేసింది. డ్రైవ‌ర్ లేకుండానే ఆ ట్రాక్టర్ భూమిని దున్నేస్తోంది. ఆ ట్రాక్టర్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ పొలం దున్నడం ఏంటని షాక్ తిన్నారు. వావ్ అంటూ కమెంట్లు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

కాగా వరంగల్‌కు చెందిన కళాశాల తయారు చేసిన ట్రాక్టర్ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ట్రాక్టర్ తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు. వినూత్న యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ ట్రాక్టర్‌ను డెవ‌ల‌ప్ చేసిన తీరు త‌న‌ను ఎంతో ఇంప్రెస్ చేసిన‌ట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక భ‌విష్యత్తులో వ్యవ‌సాయం ఇలాగే ఉంటుంద‌ని ఆ వీడియోను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో కామెంట్ చేశారు. స‌మాజంపై ప్రభావం చూపే ఆవిష్కర‌ణ‌ల‌కు చెందిన ఐడియాలు, ఉత్పత్తుల‌తో యువ‌త ముందుకు రావాల‌ని మంత్రి కోరారు. స‌మాజ శ్రేయ‌స్సు కోసం ఆవిష్కరణలు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. టీహెబ్‌, టీవ‌ర్క్స్‌, వీహ‌బ్ లాంటి సంస్థలు స‌హ‌క‌రించేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని మంత్రి అన్నారు.

Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను

Exit mobile version