NTV Telugu Site icon

Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుంది

Ktr

Ktr

Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అనాడు నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాటం చేసామన్నారు. కాళేశ్వరం కట్టి నీటి సమస్య తీర్చుకున్నమని తెలిపారు. 73 వేళ కోట్లతో 60 లక్షల పైగా రైతుల ఖాతాల్లో రైతు బంద్ జమ చేశామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని అన్నారు. 2 లక్షల 20 వేళ ప్రభుత్వ రంగం లో ఉద్యోగులు ఇచ్చామన్నారు. ఉద్యమ పునాది కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

Read also: Komatireddy Venkat Reddy: అందరి వాడు.. బాబూ జగ్జీవన్ రామ్

జల్, జంగల్, జమీన్ అనే విధంగా పట్టాలు ఇచ్చామని అన్నారు. కోమురు భీం స్పూర్తితో ఉన్నామని, 3416 తండాలను గ్రామ పంచాయితీలగా మార్చమని కేటీఆర్‌ తెలిపారు. 6 శాతం నుండి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచామన్నారు. పోడు భూములకు హక్కులు ఇస్తున్నామనిత తెలిపారు. 1 లక్ష 50 వేళ మందికి 4 లక్షలకు పైగా పట్టాలు ఇస్తున్నామని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2058 ఎకరాలు,1650 మందికి పట్టాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పోడు పట్టాలు పొందిన వారికి తక్షనమే రైతు బందు, రైతు భీమ సౌకర్యం ప్రారంభం అవుతుందని అన్నారు. 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో అపశృతి.. మహాద్వారం వద్ద పడిపోయిన హుండీ