NTV Telugu Site icon

KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్‌ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Minister Ktr

Minister Ktr

KTR: మంత్రి కేటీఆర్‌ శుక్రవారం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు 12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో.. పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ 178.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో సిఎంఏ, స్మార్ట్ సిటీ పథకాల క్రింద రూ. 520 లక్షల తో చేపట్టిన 2 అభివృద్ధి పనులైన మోడల్ వైకుంఠ ధామం, సైన్స్ పార్క్ లను, తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ నిధులతో రూ 850 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సి , ఎస్టీ సెంటర్ లకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా భద్రకాళి మాడ వీధులు, రూ 120 లక్షలతో అంతర్గత సిసి రోడ్ లకు శంకుస్థాపన, బిసి సంక్షేమ శాఖ నిధులతో 31 వ డివిజన్ లో రూ 586 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల్ లకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.

Read also: honeytrap: హనీట్రాప్‌లో చిక్కుకున్న సైంటిస్ట్.. పాకిస్తాన్‌కు రహస్య సమాచారం చేరవేత

మంత్రి కేటీఆర్ పర్యటనలో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నుండి వరంగల్ లో ప్రారంభమవుతుంది. వరంగల్ కిట్స్ కళాశాల మైదానానికి కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్, ఎగ్జిబిషన్ తిలకిస్తారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత బిమారంలో ఏర్పటు చేసిన సమావేశంలో కెసిఆర్ కప్ ప్రైజ్ ప్రధానోత్సవం చేస్తారు. అనంతరం 4:30 నిమిషాలకు హనుమకొండ కు చేరుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఐదు గంటలకు లష్కర్ బజార్ లో ప్రభుత్వ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు.సా.5.30గంటలకు నాయుడు పెట్రోల్ బంకు సమీపంలో వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని ఇందిరా నగర్ లో రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్‌ నాగూర్ల వెంకన్న ఇంటికి వెళతారు. సా.6.15 గం.లకు గాంధీనగర్ లో(అంబేద్కర్ భవన్, టి.వి టవర్ దగ్గర) మోడల్ వైకుంఠధామానికి ప్రారంభోత్సవం చేస్తారు. సా.6.45 గం.లకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి వెళ్లనున్నారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో మంత్రి దాయకర్ రావు.. ఎమ్మెల్యేల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Harry Brook : ఏందీ హ్యారీ బ్రూక్ కాకా.. ఏ ఆర్డర్ లో వచ్చినా నీ ఆట మారాదా..

Show comments