NTV Telugu Site icon

Minister KTR: నా కాలికి గాయమైంది.. మంచి ఓటీటీ షోలు ఉంటే చెప్పండి

Minister Ktr

Minister Ktr

Telangana Minister KTR leg injured: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తాజాగా తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తరచూ ఎడమ కాలిలో నొప్పి వస్తుండటంతో డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకోగా శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తాను శస్త్రచికిత్స చేయించుకున్నట్లు స్వయంగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాలికి కట్టు ఉండటం వల్ల మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కాలుకు శస్త్ర చికిత్స జరిగిందని.. మూడు వారాల పాటు ఖాళీగా ఉన్నందున కాలక్షేపం కోసం ఓటీటీలో మంచి షోలు ఉంటే సలహా ఇవ్వాలని నెటిజన్లను మంత్రి కేటీఆర్ కోరారు.

Read Also: Viral News Of Gst Bills: షాపింగ్ మాళ్లలో ఇలా చేస్తే.. జీఎస్టీ పడదా?

కాగా నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉరుకులు, పరుగులు తీసే మంత్రి కేటీఆర్ శనివారం కూడా ప‌లు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో కేటీఆర్ కాలు చీలమండకు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇంటికి చేరిన కేటీఆర్‌… కాలి చీల‌మండ‌కు పెద్ద బూటు లాంటి బ్యాండేజీతో క‌నిపించారు. మరోవైపు జూలై 24న ఆదివారం నాడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ వేడుకలను తాను జరుపుకోవడం లేదని కేటీఆర్ స్వయంగా తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తన పుట్టిన రోజు వేడుకలకు బదులుగా స్థానికంగా ఉన్న ప్రజలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Show comments