NTV Telugu Site icon

KTR: నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌..షెడ్యూల్ ఇదే

Ktr2 Copy

Ktr2 Copy

పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతోపాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
అనంతరం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఇప్పటికే అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు.

పర్యటన వివరాలుః

ఉదయం 9 గంటలకు మంత్రి కేటీఆర్‌ హెలికాప్టర్‌లో ఖమ్మం పట్టణానికి చేరుకుంటారు. 9.15 గంటలకు లకారం చెరువుపై రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ను జాతికి అంకితం చేస్తారు.

ఉదయం 9.45గంటలకు రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్‌, బృహత్‌ పల్లెప్రకృతివనం ప్రారంభిస్తారు.

ఉదయం 10.15 గంటలకు టేకులపల్లిలో 240 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు.

10.45 గంటలకు సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం పాత మున్సిపల్‌ కార్యాలయంలో సిటి లైబ్రరీ, ఐటీ హబ్‌ సర్కిల్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు నిర్మించిన ఫుట్‌పాత్‌, దానవాయిగూడెంలో ఎఫ్‌ఎస్టీపీ, ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌నగర్‌లో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు.

City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు