NTV Telugu Site icon

KTR Tour: రాహుల్‌ కంటే ముందే వరంగల్‌కి.. 2 రోజుల్లో కేటీఆర్‌ టూర్..

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నారు.. అందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.. ఆ సభలో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ.. అయితే, రాహుల్‌ కంటే ముందే వరంగల్‌ పర్యటనకు సిద్ధం అయ్యారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.. ఈ నెల 20వ తేదీన ఆయన వరంగల్‌ టూర్‌ ఖరారైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన.. అనంతరం బహిరంగసభలో పాల్గొనబోతున్నారు..

Read Also: Fertilizers: యూరియా, డీఏపీ, ఎరువులు సిద్ధం చేయండి.. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు

ఇక, మంత్రి కేటీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్‌ నేతలు.. హనుమకొండలోని హాయగ్రీవచారీ గ్రౌండ్‌లో సభ నిర్వహణ కోసం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌తో పాటు.. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించరు. మొత్తంగా ఉదయం, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్న కేటీఆర్, సాయంత్రం బహిరంగసభలో పాల్గొంటారు. ఇక, వరంగల్‌లో కాంగ్రెస్‌ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్‌ కేటీఆర్‌ పర్యటనను ప్రతిష్మాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ మంత్రి కేటీఆర్‌ ఖమ్మంలో పర్యటించాల్సి ఉన్నా.. కొన్ని కార్యక్రమాలతో తన పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.