Site icon NTV Telugu

Minister KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్‌..1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ

Minister Ktr

Minister Ktr

Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి జిల్లా సమీకృత కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తారు.

Read also: Earthquake: ఐస్‌లాండ్ రాజధాని చుట్టూ ఒకే రోజులో 1600 భూకంపాలు..

సిరిసిల్ల బీఆర్‌ఎస్‌వీ యూత్‌ అధ్యక్షుడు సుంకపాక మనోజ్‌ తండ్రి ఇటీవల మృతి చెందగా, మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం విలాసాగర్‌కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. బుధవారం పద్మనాయక కల్యాణ మండపంలో పట్టాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖేమ్యానాయక్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Astrology: జూలై 06, గురువారం దినఫలాలు

Exit mobile version