NTV Telugu Site icon

Minister Ktr: ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది

Minister Ktr

Minister Ktr

Minister Ktr:ఫెడ్ ఎక్స్ ఒక్క సంస్థ ఏడు వేల ఉద్యోగాలు సృష్టించిందని, గతేడాది లో లక్ష 50 వేల ఉద్యోగాలు సంవత్సరం వచ్చాయని, 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని తెలిపారు. 2030 వరకు 250బిలియన్ డాలర్లు అనుకుంటున్నామని, ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాలుగవ తరగతిలో హైదరాబాద్‌ నగరానికి వచ్చానని ఇక్కడి వాతావరణం అలవాటు పడ్డాక, గండిపేట నీళ్ళు పడడంతో నీళ్ళు వంటబట్టాయి అనేవారని తెలిపారు మంత్రి.

Read also: Naga Chaitanya: డిన్నర్ కి వెళ్లిన చై-శోభిత… సోషల్ మీడియాలో ఫోటో వైరల్

1908వ సంవత్సరంలో మూసి వరదలు వచ్చినప్పుడు నిజాం మోక్షం గుండం విశ్వేశ్వరయ్య ను పిలిచి రిజర్వాయర్ కు ప్రణాళికలను ఇవ్వమన్నారని తెలిపారు. 103 సంవత్సరాల కింద ఈ రెండు రిజర్వాయర్లు కట్టారని అన్నారు. మన నగరానికి అతి పెద్ద వరం మూసి అని, 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మన మూసిలోకి వస్తాయని, అప్పటి రూపురేఖలు మారిపోయాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి మన హెచ్ ఏం.డి.ఏ అని వ్యాఖ్యానించారు. కుటుంబ సమేతంగా కొద్ది సేపు సమయం గడుపుదామని అనుకునే వారికి ఈ చెరువులు ఉపయోగపడతాయన్నారు. ఈ మధ్యకాలంలో దుర్గం చెరువు బ్రిడ్జ్ లేని సినిమా లేదని ఆనందం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ చైర్మన్ 200 ఎకరాల్లో యూనిట్ పెడుతున్నారని తెలిపారు. వారిని కొంగరకలాన్ నుండి ఓ.ఆర్.ఆర్ మీదుగా దుర్గం చెరువు బ్రిడ్జి మీదుగా తీసుకు వచ్చానని, ఆయన సీఎం కేసీఆర్ వద్దకు వచ్చాక ఇది ఇండియానేనా అని అన్నారు.

Read also: KTR: నేను ఇంటర్ చదివింది గుంటూరులోనే కానీ.. వాటిగురించి మాట్లాడను

మన నగరం చాలా అభివృద్ధి చెందిందని విదేశాల నుండి వచ్చిన వారు చెబుతున్నారని తెలిపారు. 50 చెరువులను తాము అభివృద్ధి చేస్తామని పెద్ద కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. చెరువు అభివృద్ధికి కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారని, మీరు ఇక్కడ లాభాల కోసం చూడకండని, మన ముందు తరాలకు వీటిని అందించాలని తెలిపారు. చెరువులలో పట్టా భూములు ఉన్నయి.. ఇందుకోసం ఒక ఆలోచన చేసామని మంత్రి పేర్కొ్న్నారు. 13 చెరువులలో ఉన్న 115 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి 182 టి.డి.ఆర్ లు ఇచ్చామన్నారు. మేము చెరువులను వారికి రాసివ్వడం లేదని, వారితో ఇక్కడ ఖర్చు చేయిస్తున్నమన్నారు. చిన్న తప్పు జరిగినా అందరం బద్నాం అవుతామని తెలిపారు. 2022 లో ఆఫీస్ స్పేస్ లో నంబర్ వన్ వచ్చింది మన హైదరాబాద్ అన్నారు. కట్టు కథలు, పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావన్నారు. వాక్సిన్ నగరంగా హైదరాబాద్ ఉందని కేటీఆర్‌ పేర్కొ్న్నారు. వచ్చే సంవత్సరం వరకు1400 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, ఫాక్స్ కాన్ వల్ల 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
Summer Heat: హైదరాబాద్ లో వేసవి తాపం.. ఎల్లో అలర్ట్ జారీ