NTV Telugu Site icon

KTR: పెద్ద నేరాలకు పాల్పడేవారు.. పెద్దవారిగానే శిక్షింపబడాలి..

Ktr

Ktr

జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అత్యాచారం వంటి పెద్ద నేరాలకు పాల్పడే వ్యక్తులు.. పెద్దవారిగానే శిక్షించబడాలని.. యువకుడిగా కాదని ఆయన అన్నారు.

జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్‌దే తుది నిర్ణయం కానుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.