Site icon NTV Telugu

Himanshu tweet: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ కు కేసీఆర్‌ మనవడు రీ ట్వీట్‌.. వైరల్‌

Himanshu Tweet

Himanshu Tweet

Himanshu tweet: సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరు అలర్ట్‌ గా వుంటారు. నిజ జీవితంలో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కవగా గడిపేస్తుంటారు. ఇక రాజకీయ నాయుకులు, వ్యాపారస్తులు ఏదైన ట్వీట్‌ చేస్తే చాలు దాన్ని ట్రోల్‌ చేస్తు తెగ కామెంట్లె పెడుతుంటారు. కొద్దిరోజుల క్రితం ఆనంద్‌ మహీంద్ర చేసిన ట్విట్‌ కు కేటీఆర్‌ కుమారుడు, సీఎంకేసీఆర్‌ మనవడు హిమాన్షు చేసిన ట్విట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది. హిమాన్షు.. మా తాతయ్య కేసీఆర్ పులి అంటూ చేసిన ట్వీట్పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా గురువారం ట్విట్టర్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. సైలెంట్గా అన్నీ ప‌రిశీలిస్తున్న ఓ పులి ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మ‌హీంద్రా, నేనేమీ రియాక్ట్ కాను, అయితే.. అన్నింటినీ సైలెంట్గా గమనిస్తానని న‌మ్ము.. అనే విషయాన్ని టైగర్ చెబుతున్నట్లుగా ట్వీట్ చేస్తూ..మీ ఇంట్లో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్యక్తి ఎవ‌రంటూ మ‌హీంద్రా ప్రశ్నవేశారు.

అయితే.. ఈ ట్వీట్‌కు స్పందించిన హిమాన్షు మా ఇంట్లో అయితే మా తాత గారు సీఎం కేసీఆర్‌ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ ఓరేంజ్‌ లో వైరల్‌ అవుతుంది. ఈనెల ఆగస్టు 11న చేసిన ఈ ట్వీట్ వైరల్ కాగా, కేసీఆర్పై కొంతమంది ప్రశంసిస్తుండా, మరి కొంత విమర్శలు చేస్తున్నారు. బెంగాల్ టైగర్ మా కేసీఆర్ అని కేసీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే.. గ‌తంలో కూడా మ‌హీంద్రా ట్వీట్లకు కేటీఆర్ స్పందించ‌గా, తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఏదిఏమైనా.. మొత్తానికి ఆనంద్ మ‌హీంద్రా విసిరిన ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Exit mobile version