NTV Telugu Site icon

KTR Latest Tweet: ఆ.. డ్యాన్స్‌కు కేటీఆర్‌ ఫిదా.. కేక పుట్టించారంటూ ట్వీట్

Ktr New Tweet

Ktr New Tweet

సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్‌ లో మంత్రి కేటీఆర్‌ నిత్యం చురుకుగా ఉంటారు. అంది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. మంత్రి అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించినా వెంటనే స్పందిస్తూ.. వాళ్లకు తగినైన సాయం చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా వుంటూ.. కేటీఆర్‌ అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలు కూడా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈనేపథ్యంలోనే ట్విటర్‌ లో వైరల్‌ అవుతున్న ఓవీడియోను కేటీఆర్‌ పంచుకున్నారు. ఈవీడియో చూస్తే ఖచ్చితంగా మీముఖాల్లో ఆనందం చిరునవ్వు వస్తుందని, పిల్లలు అద్భతంగా డ్యాన్సర్లు అంటూ ప్రశంసించారు.

Pakistan: “నేషనల్ ఎమర్జెన్సీ” ప్రకటించిన పాక్

కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన వీడియోలో, కొంత మంది విదేశీ పిల్లలంతా కలిసి డ్యాన్స్​ చేస్తున్నారు. మరి ఆవీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా? వాళ్లు స్టెప్పులేసింది ఓ బాలీవుడ్​ పాటకు మరి.. యూట్యూబ్​ షాట్స్​, ఇన్​స్టా రీల్స్, పెళ్లిల్లు, సంగీత్​లు ఇలా​ ఎక్కడ చూసినా, క్రికెటర్ల నుంచి సామాన్యుల దాకా ఇదే పాటకు స్టెప్పులేస్తున్నారు. బాలివుడ్‌ బ్యూటీ కత్రినా స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాలా చష్మా పాట అది. పిల్లలు ఒకచోట చేరితే ఇక వారిని ఆపే ప్రసక్తే వుండదు. అలాంటిది మన స్నేహితులంతా ఓ చోట చేరి తమదైన శైలిలో డ్యాన్స్​ చేస్తూ, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పెడుతున్నారు. ఇక మొత్తానికి సోషల్​ మీడియాను కాలా చష్మా పాట ఓ ఊపు ఊపేస్తోన్న పాటకు నైజీరియన్​ పిల్లలు వేసిన అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆడ్యాన్స్‌కు ఫిదా అయిన మంత్రి.. వీడియోను ట్విటర్​ వేదికగా పంచుకున్నారు. ఓచిన్నారి కేటీఆర్‌ కే ట్వీట్‌ చేశాడు. హాయ్​ కేటీఆర్​ అంకుల్. ఇవాళ నా పుట్టినరోజు మీరు నన్ను ఆశీర్వదించరూ అంటూ క్యూట్​గా అడిగిన వీడియోను పంచుకున్నారు కేటీఆర్‌. ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్‌ దీవెనలు అందించారు. ఈవిధంగా చిన్నారుల వీడియోలు పంచుకుంటూ పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు మంత్రి కేటీఆర్‌.