NTV Telugu Site icon

Minister KTR: మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానికి నిదర్శనం మీ స్పందనే

Minister Ktr

Minister Ktr

Minister KTR: మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర CII వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ,సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఈ మీటింగ్ కు హాజరు అవుతున్నానని తెలిపారు. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మాకు అధికారాన్ని కట్టబెట్టండని కోరారు. మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మసిటీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. జినోమ్ వ్యాలీ మెడికల్ డివైసెస్ పార్క్ ను విస్తరిస్తున్నామని తెలిపారు. భారతదేశానికి హైదరాబాద్ లాంటి నగరాల అవసరం ఉందని తెలిపారు. కొంగరకలాన్ లో ఫాక్స్ కామ్ 200 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది, లేఖ విడుదల చేసిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు ఆసక్తి చూపాలన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూత ఇవ్వాలని అన్నారు. ఇండియా అంటే… రాష్ట్రాల సమూహమని, మేకిన్ ఇండియా మంచి నినాదం… కానీ అది అమలు అయిందా ? అని ప్రశ్నించారు మంత్రి. మోడీ నీ కలిసే అవకాశం ఉన్నవాళ్లు చెప్పండి… కొన్ని రాష్ట్రాలు బాగా పని చేస్తున్నాయి అని చెప్పాలని మంత్రి కోరారు.

Read also: KTR: రేపు తొర్రూరుకు కేటీఆర్.. 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభ

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. హైదరాబాద్ నగరానికి అనేక ప్రయోజనాలు, బలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోనే 9 బిలియన్ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులో ఉందన్నారు. తెలంగాణలో అతిపెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికే హైదరాబాద్ స్టెంట్ ఆఫ్ మొబిలిటీ అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో అతిపెద్ద వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేశామన్నారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని అన్నారు. ఉపగ్రహాల తయారీలో మొదటి ప్రైవేట్ సెక్టార్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి స్కైరూట్ ప్రతినిధులకు అభినందనలు. డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసే వినూత్న కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పత్తికి దేశంలోనే మంచి డిమాండ్ ఉందన్నారు. టెక్స్‌టైల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్కును పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొంగరకలాన్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ఫాక్స్‌కాన్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఫాక్స్‌కాన్‌కు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు నీటి సమస్య లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Show comments