Site icon NTV Telugu

Ktr road show in Munugode: నేడు మునుగోడుకుమంత్రి కేటీఆర్‌.. మధ్యాహ్నం రోడ్‌ షో

Ktr

Ktr

Ktr road show in Munugode: మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరుమీదుంది. ప్రచారంలో నాయకులు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధింస్తున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇవాళ రానున్నారు. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్‌ వరకు రోడ్‌ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌ షో ప్రారంభం కానుంది. చౌటుప్పల్‌లోని చిన్నకొండూరు చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నట్లు మున్సిపల్‌ ఛాంబర్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. నెలాఖరులో మునుగోడులో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ నిన్న మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ సమస్యను, మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను, సాగునీటి ప్రాజెక్టులను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లామో అదే సంకల్పంతో మరింత ముందుకు పోతామని, ఎన్నికల్లో ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలను చేస్తుందని, భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ ప్రజలు ఏ విధంగా అయితే హుజూర్‌నగర్ నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపును కట్టపెట్టారో అదే ఫలితం మునుగోడు లోను పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్తు పైన ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో అత్యంత కింది స్థానానికి దేశాన్ని పడేసిన ప్రధానమంత్రి, ఆయన పార్టీ బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించి అర్హత ఏమాత్రం లేదు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి కేటీఆర్‌ ను తిట్టినంత మాత్రాన మీకు ఓట్లు పడవు. ప్రజలకు మంచి పనులు చేస్తే, వాటిని చెప్తే ఓట్లు వేస్తారు.
Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం

Exit mobile version