NTV Telugu Site icon

Minister KTR: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ.. పలు అంశాలపై విజ్ఞప్తి

Ktr Hardeep Singh1

Ktr Hardeep Singh1

Minister KTR Requested Central Minister Hardeep Singh Puri To Release Funds For Telangana Development: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను అందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరారు. లక్డీకాపూల్ నుంచి బిహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మరో ప్రతిపాదనను సమర్పించారు.

Madhu Goud Yaskhi: కేసీఆర్ బీజేపీకి బీ-టీమ్‌గా పని చేస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్డుల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని.. ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లను కేటాయించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు.. ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రోక్యుర్మెంట్ కోసం, ట్రాన్స్ఫర్ స్టేషన్‌ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3050 కోట్లతో చేపడుతున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15% నిధులను కేంద్రం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Pune: అత్యాచార ఆరోపణ, జైలు జీవితం.. అవమానంతో కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు రూ.3722 కోట్లు అని, ఇందులో కనీసం 20 శాతం అంటే రూ.744 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించాలని అడిగారు. కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని.. వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు రూ.3777 కోట్లు ఖర్చుఅవుతుందని, ఇందులో రూ.750 కోట్లను కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం శానిటేషన్ హబ్ కార్యక్రమంపై హర్దీప్ సింగ్ ప్రశంసలు కురిపించారు. దీనిపై ఢిల్లీలో ఏర్పాటు చేసే మంత్రిత్వ శాఖ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పిన కేటీఆర్.. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్ఆర్‌డీపీ, లింకు రోడ్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్రమంత్రిని ఆహ్వానించారు.