బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక, ఇవాళ ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ఐదోసారి బరిలో దిగుతున్నారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో ఆర్మూర్‌లో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక, సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
Read Also: Harish Rao: సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేసిన హరీశ్ రావు
ఇక, మంత్రి కేటీఆర్ 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్ గా కేటీఆర్ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేసి తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచడంతో పాటు సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్ రెడ్డిపై మరోసారి 68 వేల 219 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 జనరల్ ఎన్నికల్లో 53 వేల 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89 వేల 9 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కేటీఆర్ రికార్డు సృష్టించారు.