NTV Telugu Site icon

Minister KTR: పెట్టుబడుల ఉపసంహరణ వెనక్కి తీసుకోవాలి

Ktr

Ktr

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్ మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్నారు కేటీఆర్.

ఈ 6 సంస్ధలకు గతంలో సుమారు 7200 ఎకరాల భూమి కేటాయించింది రాష్ర్టం. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం 5వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తాయి ఈభూములు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ.40వేల కోట్లు ఉండనుంది ఆయా భూముల విలువ. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలన్నారు.

 

లేదంటే ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూముల సద్వినియోగం వుండాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్టం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Atmakur Bypoll: వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది