Site icon NTV Telugu

సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్‌

నల్లగొండ జిల్లాలో టీహబ్‌, టాస్క్‌ సెంటర్‌ను మంజూరు చేస్తామని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలోని నూతన ఎస్సీ, ఎస్టీ హస్టల్‌ భవనాలను ప్రారంభించి. టీహబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. నల్లగొండకు ఐటీ హబ్‌ కేసీఆర్‌ వల్లనే సాకరమైందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలనేదే సీఎం కేసీఆర్‌లక్ష్యమన్నారు. వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఐటీహబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 18 నెలల్లో నల్లగొండ రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తామన్నారు. ఐటీ హబ్‌తోపాటు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ కంపెనీలను తీసుకొచ్చి 1600పైగా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Read Also:ప్రతిపక్ష పార్టీల నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. నల్లగొండను ఏ పాలకులు పట్టించుకోలేదని, నల్గొండ జిల్లాలో 65 ఏళ్లుగా పరిష్కారం కానీ ప్లోరోసిస్‌ సమస్యకు తాము ఆరేళ్లలోనే మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్‌ సమస్యను పరిష్కరించామన్నారు. సూర్యాపేట, నల్లగొండకు మెడికల్‌ కాలజేజీలు ఇచ్చామన్నారు. భువనగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పామన్నారు. రూ.1800 కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కొరూ ఐటీ ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ నూతన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

Exit mobile version