మాజీ సీఎంకు రోశయ్యకు నివాళి అర్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రోశయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లో సౌమ్యుడిగా ఉండేవారు. వాడివేడిగా సమావేశం జరుగుతున్న సమయంలో కూడా… నవ్వులు పూయించేలా చమత్కారంగా మాట్లాడేవారు అని గుర్తుచేశారు. సిరిసిల్ల లో నేత కార్మికుల గురించి అడిగితే… వెంటనే స్పందించారు అన్నారు. ఆయన ప్రజాస్వామ్య హితంగా ఉండేవారు అన్ని పేర్కొన కేటీఆర్ రోశయ్య లేరు అనేమాట… బాధాకరం… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అయితే రోశయ్య ఆకస్మిక మరణానికి రాజకీయ, సినీ, సామాజిక రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రోశయ్య పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.
రోశయ్య లేరు అనేమాట… బాధాకరం : కేటీఆర్
