Site icon NTV Telugu

KTR: పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?.. ప్రధానికి కేటీఆర్ కౌంటర్

Minister Ktr

Minister Ktr

KTR: ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. పేదల సంక్షేమ పథకాలపై మోడీకి ఎందుకింత అక్కసు అంటూ పేర్కొన్నారు. అసలు మోడీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ పత్రికా ప్రకటన చేశారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అని మండిపడ్డారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోడీ విధానమని మంత్రి విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా అంటూ ప్రశ్నించారు.

Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?

రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు, కార్పొరేట్లకు పన్ను రాయితీలా? అని ప్రశ్నించారు. 80 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారని మంత్రి కేటీఆర్ అడిగారు. దేశ సంపదను పెంచే తెలివి లేదన్న కేటీఆర్.. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదని విమర్శలు గుప్పించారు.

Exit mobile version