Site icon NTV Telugu

KTR Criticized PM Modi Speech: ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

Ktr, Modi

Ktr, Modi

ట్విట్‌ వేదికగా ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు సంధించారు. భారత 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై విమర్శల వర్షం కురిపించారు కేటీఆర్‌. మోడీ గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదని, కొత్తగా మరికొన్ని నిదర్ధేశాలు చెబుతున్నారని ఎద్దేవ చేసారు. ఇప్పటివరకు చెప్పినవి చేయకుండా మళ్లీ కొత్త లక్ష్యాలు గురించి చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. 2022 ఆగ‌స్టు 15 నాటికి భార‌త్ ఎన్నో ఘ‌న‌త‌లు సాధిస్తుంద‌ని గ‌తంలో చేసిన ప్రసంగాల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

నిన్న సోమ‌వారం (ఆగస్టు 15,2022) ఎర్రకోట వేదిక‌గా 2047 కోసం ప్రధాని మోడీ త‌న ప్రసంగంలో కొన్ని ల‌క్ష్యాల‌ను నిర్దేశించారు. అయితే.. రానున్న 25 ఏళ్లలో ఆలక్ష్యాలను అందుకోవాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. ప్రధాని ప్రసంగంపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ ప్రధాని నిర్ధేశించిన ఆ ల‌క్ష్యాలు గొప్పగానే ఉన్నాయి.. కానీ గతంలో ఇచ్చిన లక్ష్యాల మాట ఏంటీ అంటూ ప్రశ్నించారు.

గతంలో మోడీ ప్రసంగాలు:

2022 నాటికి ప్రతి పేద‌వాడికి ఇంటిని నిర్మించి ఇస్తామ‌న్నారు?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌న్నారు?
భార‌త ఆర్థిక వ్యవ‌స్థను 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లుగా మారుస్తామ‌న్నారు?

ప్రతి ఇంటికీ క‌రెంటు స‌ర‌ఫ‌రా చేస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారు. కానీ.. వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చలేద‌ని మంత్రి కేటీఆర్ తన ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. మీరు చెప్పిన మీ నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను మీరు గుర్తించ‌లేన‌ప్పుడు జ‌వాబుదారీత‌నం ఎక్కడ ఉంటుంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Exit mobile version