Minister KTR London tour: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. వారి ముసి ముసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా చేతులు ఆ చిన్నారిని ఎత్తుకునేందుకు వెళ్లిపోతాయి. వారిని మనం కూడా ఆడించాలని, భుజం పై వేసుకుని నిద్ర పుచ్చాలని అనిపిస్తుంది. వారితో ఆడినంతసేపు అస్సలు సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఎంత బిజీలో వున్నా ఆ చిన్నారులతో గడిపే సమయం అత్యద్భుతం అనే చెప్పొచ్చు. ఇలాంటి అనుభూతే మంత్రి కేటీఆర్ ఎదురైంది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా యూకేలోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే అధ్యక్షుడు, ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. కాగా, మంత్రి కేటీఆర్ తన ఇంటికి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నారై రత్నాకర్ తన ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. తమ ప్రార్థనలు వింటే దేవుడు కరుణిస్తాడనీ, అలాంటి జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నారై రత్నాకర్ తన వీడియోలో వ్యాఖ్యానించారు. తన ప్రియమైన సోదరుడు, మంత్రి, డైనమిక్ లీడర్ కేటీఆర్.. లండన్‌లోని తన ఇంటికి వచ్చారని ఆ వీడియోలో రత్నాకర్ తెలిపారు. ఎన్నారై ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. రత్నాకర్ కుటుంబంతో ముచ్చటించారు.
రత్నాకర్ కొడుకు రణవ్‌ని బాగా ఆడించాడు. మంత్రి కేటీఆర్ చిన్నారిని భుజంపై వేసుకుని నిద్రపుచ్చేందుకు ప్రయత్నించారు. మంత్రి కేటీఆర్ తన కుటుంబాన్ని ఆశీర్వదించారని ఎన్నారై రత్నాకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన కుటుంబానికి ఎనలేని సంతోషాన్ని కలిగించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు మాటలు చాలడం లేదని ఎన్నారై రత్నాకర్ తన ట్వీట్‌లో వెల్లడించారు. బాస్, లీడర్, బ్రదర్ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో మంత్రి కేటీఆర్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచి, ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఆ వీడియోను మంత్రి కేటీఆర్ ఇవాళ రీట్వీట్ చేశారు. ఎన్నారైలు చూపుతున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం అంటూ రీట్వీట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Sharwa Rakshita: శర్వానంద్ పెళ్ళి పీటలు ఎక్కేదెప్పుడంటే…
