Site icon NTV Telugu

ASK KTR: మూడోసారి గెలుపు మాదే

Ktr2

Ktr2

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు కేటీఆర్.

అభివృద్ధి కొనసాగిస్తాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోంది. బీజేపీ అసలు స్వరూపం ఇదే. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ. గ్యాస్‌ ధరల్లో ప్రధాని ప్రపంచ రికార్డ్‌ సృష్టించారు. ఈ విషయంలో ఆయన్ను ఎవరు ఆపలేకపోతున్నారు. డీజిల్‌ 100 దాటింది.. గ్యాస్‌ వెయ్యి దాటింది.. ఇవి చరిత్రలో నిలిచిపోతాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు..చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయి. రాహుల్ గాంధీ మొదట అమేథీలో గెలవడం పై దృష్టి పెట్టాలని చురకలు వేశారు. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని అనడం సరికాదు. బీజేపీ అప్పుడు గ్యాస్ ధరలపై పోరాడి..ఇప్పుడు ధరలు తగ్గించాలన్నడం మోసంకాదా అన్నారు.

కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదు. మిషన్‌ భగీరథ కోట్లాది మంది ప్రజల గేమ్ ఛేంజర్‌. ఏడేళ్లలో 120 శాతం వ్యవసాయం పెరిగింది. 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమాతో సాధ్యమైందన్నారు కేటీఆర్. విద్యావిధానం, ఎన్నికల్లో మిస్సింగ్ ఓట్లు, నగరంలో అభివృద్ధి, వివిధ సమస్యల గురించి నెటిజన్లు కేటీఆర్ ని ప్రశ్నలు అడిగారు. అందరికీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు.

Mp Santosh Kumar: గిర్ నేషనల్ పార్క్‌లో అమ్మ, అందమైన పిల్లలు

Exit mobile version