NTV Telugu Site icon

హ‌రిత విప్ల‌వానికి కేసీఆర్ తెర‌లేపారు-కేటీఆర్

KTR

తెలంగాణ‌లో హ‌రిత విప్ల‌వానికి సీఎం కేసీఆర్ తెర‌లేపారు అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు మంత్రి కేటీఆర్.. ఇవాళ సిరిసిల్లలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చార‌ని తెలిపారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వ‌మ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మత్తల్లు దుకించినా ఘనత కేసీఆర్‌దే అన్నారు.. రైతాంగానికి రైతు బీమ‌, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింద‌ని గుర్తుచేసిన ఆయ‌న‌.. ఈ సంవత్సరం జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అని అంచనా వేస్తే.. మూడు లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చింద‌న్నారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి కుడెల్లి వాగులో నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేన‌న్న ఆయ‌న‌.. ఈ సంవత్సరం ప్రతి రైతు బంపర్ దిగుమతి సాధించాడు.. దీనికి గల కారణం సీఎం కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్ణయాలే అన్నారు.. సిరిసిల్ల పెద్దురులో 22 కోట్ల తో అధునాతమైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ పూర్తయింది, ఈనెల 11న వ్యవసాయ మంత్రి తో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంద‌ని.. ఈనెల 15వ తారీకు నుంచి రైతులకు, రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయ‌నే గుడ్‌న్యూస్ తెలిపారు.. ఫారెస్ట్ భూములకు సంబంధించిన వివాదాలు ఉంటె కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు మంత్రి కేటీఆర్.