NTV Telugu Site icon

Minister KTR: కేయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన మంత్రి కేటీఆర్

Ktr Minister

Ktr Minister

KTR: కేయూలోని పరిణామాలను మంత్రి కేటీఆర్ కు విద్యార్థులు వివరించారు. దీంతో స్పందించిన కేటీఆర్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థులకు జరిగిన ఇబ్బందులపై క్షమాపణ చెప్పారు. రాంపూర్ లో ఐటి పార్క్ వద్ద మంత్రి కేటీఆర్ ను కేయు విద్యార్థులు కలిశారు. విద్యార్థుల డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించారు. విద్యార్థులపై పెట్టిన కేసులు నెత్తివేయాలని సిపికి ఆదేశించారు. యూనివర్సిటీలోని సమస్యలపై ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆశావర్కర్ల సేవలు గుర్తున్నాయ్‌.. త్వరలో పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ లో మంత్రి పర్యటన కొనసాగుతుంది. రాంపూర్ ఐటి పార్క్ లో Quadrant టెక్నాలజీ సాప్ట్ వేర్ కంపెనీ ని ప్రారంభించారు.

అనంతరం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని ఆశా వర్కర్లు కలిసి మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆశ వర్కర్లకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ఎవరో.. రెచ్చకోడితే మీరు ధర్నాలు చెయ్యకండని సూచించారు. కారోన టైంలో మీరు చేసిన సేవలు గుర్తు ఉన్నాయన్నారు. త్వరలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అనంతరం హన్మకొండ ప్రగతినగర్ లోని 15 MLD STP , సేవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (మురుగునీటి శుద్ది కేంద్రం) ను, నిట్ ప్రాంతంలో జంక్షన్ ను, రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన ఎన్ఐటి జంక్షన్, మడికొండ ఐటీ పార్క్ లో క్వాడ్రాంట్ సాప్ట్ వేర్ కంపెనీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎంపీ దయాకర్ పాల్గొన్నారు.
Shraddha Kapoor: ప్రభాస్ నటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరవుతారా?