Site icon NTV Telugu

Face to Face with KTR : పీకేను అందుకే తీసుకువచ్చాం

Ktr Face To Face

Ktr Face To Face

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఎన్టీవీ ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అపర చాణిక్యుడైన కేసీఆర్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ సాయం ఎందుకు కావాల్సి వచ్చిందనే ఎన్టీవీ ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలుడు, రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్‌ ఉద్యమ నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగానే తెలుసు అని, జనరేషన్‌ మారుతున్న కొద్దీ, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పుడున్న నవ యువతరం ఎక్కువగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని, అయితే అక్కడి నుంచి కూడా క్షేత్రస్థాయిలో పార్టీకి బలం చేకూర్చేందుకు ఆయన తీసుకువచ్చామన్నారు. అంతేగానీ మాకు లేని శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని కాదని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version