Site icon NTV Telugu

ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న వ్యక్తి ఈటల…

koppula eshwar

koppula eshwar

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సభలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగ పుత్రుల ఏకగ్రీవ తీర్మాణం చేసారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 25,116 అందజేశారు గంగ పుత్రులు సంఘం సభ్యులు.

Read Also : హుజూరాబాద్‌లో ముగ్గురూ బీసీలేనా..?

అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ఉద్యమ బిడ్డ. గతంలో ఏ ప్రభుత్వాలైనా ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకున్నాయా?… తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయి, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఆనాడు సీఎం కెసిఆర్ గారు అవకాశం ఇస్తేనే రాజకీయంగా ఈటల ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం. మీ మట్టిబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉంది. కేసులు, లాఠీ దెబ్బలకు భయపడని బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని తెలిపారు.

కానీ ఒక ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న వ్యక్తి ఈటల రాజేందర్. అభ్యర్థి డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అభ్యర్థికి మీరు డబ్బులు ఇవ్వడం శుభపరిణామం. చెరువుల్లో ఉచితంగా చేపలు వేసిన గొప్ప ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా అమలు చేస్తుందా… ఈటల రాజేందర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు.. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారొ చెప్పాలి అని కోరారు.

Exit mobile version