NTV Telugu Site icon

Komuravelli Mallanna: వైభవంగా మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Komarivelli Mallanna Kalyanam

Komarivelli Mallanna Kalyanam

Komuravelli Mallanna: కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి భక్తుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. ఉజ్జయిని అధ్యక్షులు సిద్ధలింగ రాజదేశికేంద్ర ఆధ్వర్యంలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతంతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.

భక్తుల కోసం హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కాగా రెండు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవ వేడుకలను ఆలయ వర్గాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు రథోత్సవం. రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.

Read also: Jabardasth Avinash: బిడ్డని కోల్పోయిన అవినాష్… తల్లి గర్భంలోనే మరణించిన శిశువు

వివాహ మహోత్సవ పత్రిక..

వరుడు: మల్లికార్జున స్వామి
వధువులు: మేడలాదేవి, కేతమ్మ దేవి
సుముహూర్తం: స్వస్తిశ్రీ శోభకృత్ పేరు
కల్యాణ వేదిక: కొమురవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో తోట బావి
కన్యాదాతలు: మహాదేవ వంశస్థులు
లబ్ధిదారులు: పడిగంగారి వారసులు
వైదిక పర్యవేక్షణ: 1008 వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్యుల ఆధ్వర్యంలో
అర్చకులు: నడిపూడి మఠం భవనయ్య స్వామి, భువనేశ్వర స్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర శాస్త్రి, చంద్రశేఖర్ స్వామి, భద్రయ్యస్వామి,
వ్యాఖ్యాతలు: డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ
ముఖ్యఅతిథులు: స్వామి భక్తులు
ఆహ్వానితులు: ఆలయ కార్యనిర్వహణాధికారి, వీరశైవ అర్చకులు, అర్చకుల బృందం, ఆలయ సిబ్బంది.
TGO Mamatha Transfer: టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు..!

Show comments