Site icon NTV Telugu

Jupally Krishna Rao: హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం..

Jupalli Krishna Rao

Jupalli Krishna Rao

Jupally Krishna Rao: హరిత తారామతి బారదారి రిసార్ట్ లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్ అంత కలియతిరిగారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్ ను పరిశీలించారు. హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలన్నారు. చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు?, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు. హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read also: Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!

తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీనికి నిర్వహణలోపమే ప్రధాన కారణం అని తెలిపారు. ఆదాయం సరిగా లేదు. గతంలో పట్టించుకునే వారే లేరన్నారు. వివిధ స్థాయిల్లో సరైన నిర్ణయాలు తీసుకొని కారణంగా పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయాం. ఇప్పటినుంచి ప్రతీ నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో వాటి రూపురేఖలను మారుస్తామని వివరించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామని, భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి.. యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళన

Exit mobile version