Site icon NTV Telugu

వేడుకలు వద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోండి: మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏడాదంతా వేడుకలు చేసుకోవచ్చని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరింయంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు.

Read Also:చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరూ ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాణాలు విలువైనవని అందుకే వేడుకల పేరుతో ఎవ్వరు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇబ్బందులకు గురి కావొద్దని పోలీసులకు సహకరించాలని మంత్రి చెప్పారు.

Exit mobile version