Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌ మహా గర్జన సభకు తరలి రావాలి: మంత్రి జగదీష్ రెడ్డి

నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు సృష్టించిందన్నారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణలో ఉన్న దళితులందరికి దళిత బంధు వస్తుందని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. వలిగొండ నుంచి తొర్రూరు వరకు నూతన రహదారి మంజూరు అయిందని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడకుండా సహకరించాలని మంత్రి హితవు పలికారు.

Exit mobile version