NTV Telugu Site icon

Jagadish Reddy: బీఆర్ఎస్‌ని చూసి.. మోడీ & గ్యాంగ్‌కు భయం పట్టుకుంది

Jagadish Reddy

Jagadish Reddy

Minister Jagadish Reddy Fires On BJP and Co: బీఆర్‌ఎస్‌ పార్టీని చూసి ప్రధాని మోడీ & గ్యాంగ్‌కు భయం పట్టుకుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసులు పెట్టారని, మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని పార్టీ క్యాడర్‌కు, లీడర్లకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా అంటేనే.. విపక్షాల గుండెల్లో గుబులు రేకిత్తించేలా ముందుకు సాగాలని కోరారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు.

Tammineni Veerabhadram: రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు మద్దతిస్తాం

అసలు గులాబీ పార్టీ లేకుంటే.. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వచ్చి ఉండేదా? అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం అమలులోకి వచ్చేదా.? కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్‌ల పేరుతో అడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందేదా? నల్లాల దగ్గర ఎలాంటి గలాటా లేకుండా మిషన్ భగీరథ నీళ్లు అందేవా? అని మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అవన్నీ సాధ్యమయ్యాయని నొక్కి చెప్పారు. ఇంకా అనేక పథకాలను అమలు చేస్తూ, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ.. నేడు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. పార్టీని పటిష్టం చేసుకునేందుకు గాను.. గ్రామ సభలతో సమానంగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలా నిర్వహిస్తేనే.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి వెళ్తాయని అన్నారు. అందుకే ఈ ఆత్మీయ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని.. ఈ సదస్సులు ఇచ్చే సందేశం ప్రజల్లోకి చేరేలా గులాబీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి కోరారు.

Private Doctors: రోడ్డెక్కిన ప్రైవేట్ డాక్టర్లు.. ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

అంతకుముందు.. యాదాద్రి భునగిరి జిల్లా కేంద్రంలో 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గలిగిన గోడౌన్ నిర్మాణానికి జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందన్నారు. ఒక్కప్పుడు వ్యవసాయం చేస్తే భయపడి సిగ్గుపడేవారని.. ఇప్పుడు కాలర్ ఎగరేసీ మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకునే వాతావరణం నెలకొందన్నారు. అందుకు సీఎం కెసిఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలే దోహదపడ్డాయన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడితో రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు.

Show comments