Minister Jagadish Reddy: అవే అబద్ధాలు.. అవే అర్థం లేని మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Counter on Amit Shah Speech: ఎప్పుడూ ఆధారం లేని ఆరోపణలు చేసే బండి సంజయ్ పాత్రను, ఈరోజు అమిత్ షా పోషించారంటూ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. అవే అబద్ధాలు , అవే అర్థం లేని మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం తప్ప.. అమిత్ షా మాటల్లో ఏమీ లేదన్నారు. శనివారం మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదన్నారు. అసలు సమాధానం ఉండవనే విషయం తమకు ముందే తెలుసన్నారు. బిజెపి అధినాయకుడే కెసిఆర్‌కు సమాధానం చెప్పే పరిస్థితులు లేదని దుయ్యబట్టారు. ఉన్న విషయాన్ని ఒప్పుకునే ధైర్యం బిజెపికి లేదన్నారు.
అమిత్ షా మాటలు దిగజారుడుతనంగా ఉన్నాయని.. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ఫక్తు రాజకీయాలు, ఓట్లు-సీట్లు, అధికారం తప్ప.. వాళ్లకు ఇంకో యావ లేదన్నారు. అమిత్ షా మాటలతో ఈ రాష్ట్రానికి గానీ, మునుగోడు ప్రజలకు గానీ ఒరిగిందేమీ లేదని చురకలంటించారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ లేకుండా చేస్తారన్నారు. కాగా.. తన ప్రసంగంలో భాగంగా కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని మరిచారన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..