Site icon NTV Telugu

Kukatpally Rythubazar: మోడల్ రైతు బజార్ ప్రారంభించిన హరీష్ రావు

శరవేగంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిత్యం రద్దీగా వుండే కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్‌ రైతుబజార్‌ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో మొదటగా ఎర్రగడ్డలో మోడల్‌ రైతుబజార్‌ను ఏర్పాటు చేయగా, కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో రెండో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఇక్కడ కూరగాయలు లభిస్తాయి.

కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ) రైతుబజార్‌ పున:నిర్మాణ పనులకు 2018 జూలై లో మంత్రి హరీశ్‌రావు శిలాఫలకం వేశారు. సుమారు రూ.15 కోట్లతో సెల్లార్‌ ప్లస్‌, జీ ప్లస్‌ 1 భవనంలో సకల సౌకర్యాలు ఉండేలా రైతుబజార్‌ను నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రైతులకు 158 స్టాళ్లు, స్వయం సహాయక సంఘాలకు 65 స్టాళ్లు, 18 దుకాణాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో రైతులకు 148, స్వయం సహాయక సంఘాలకు 77 స్టాళ్లతో పాటు 5 దుకాణాలు ఉన్నాయి. రైతుబజార్‌లో 471 స్టాళ్లతో పాటు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైతుబజార్‌ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

https://ntvtelugu.com/soyam-bapurao-demands-fecilities-in-iiit-basara/
Exit mobile version