NTV Telugu Site icon

Medico Preethi Uncle: మంత్రి హరీశ్ స్పందించాలి.. సైఫ్ ను కఠినంగా శిక్షించాలి

Harish Rao

Harish Rao

Medico Preethi Uncle: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సైఫ్ వేధింపులే వల్లే ప్రీతికి ఇలాంటి దుస్తితి వచ్చిందని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని.. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. నవంబర్ లో ప్రీతి కాకతీయ మెడీకల్ కాలేజీలో జాయిన్ అయ్యిందని పేర్కొన్నారు. డిసెంబర్ నుండి వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. క్యాస్ట్ పేరుతో సైఫ్ అనే విద్యార్థి ప్రీతిని వేధించేవాడని చెప్పుకొని బాధపడేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నయ్యకు చెబితే, కాలేజీ వాళ్ళతో మాట్లాడాడని, ఐనా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాబయ్‌ రాజ్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. కాలేజీ యాజమాన్యం అప్పుడే స్పందించి ఉంటే ప్రీతికి ఈగతి పట్టేది కాదని కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి హరీష్‌ రావు చొరతీసుకుని ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. మరి దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తారా? అనేది సంచలనంగా మారింది.

Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్‌ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు

డైవర్‌ చేస్తున్నారు న్యాయం చేయండి

ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రీతిని ఇవాళ వరంగల్‌ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించిన అధికారులు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి ప్రీతి నీ తీసుకొని వచ్చిన అధికారులు. అయితే దీనిపై మెడికో ప్రీతి తండ్రి నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. వైద్య చికిత్సకు ఆమె శరీరం సహకరించట్లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇష్యుని డైవర్ట్ చేయడానికే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 20 వ తేది రాత్రి కాలేజీ దగ్గరికి వెళ్ళానని, ప్రీతి ఉన్నతాధికారులకు వేధింపులుపై చెప్పానని అన్నారు. కాని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నామని, గిరిజన యువతివంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురి చేశారని తండ్రి నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్ తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పినా వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని, మార్కులు తక్కువ వేస్తారు అని భయపడిందని చెప్పుకొచ్చారు. ఎంతో ధైర్యంగా ఉండేది, కరోనాలో కూడా విధులు నిర్వర్తించిందని వాపోయాడు. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధీంచాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్ కు తీసుకువచ్చారని కన్నీరుమున్నీరు అయ్యారు తండ్రి. మాకు న్యాయం చేయాలని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని తండ్రి నరేందర్‌ కోరుతున్నారు.

ప్రీతి సోదరుడు..

మూడు నెలల నుంచి ప్రీతిని సీనియర్లు వేధిస్తున్నారని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు రాదని ఇష్టం వచ్చినట్లు వేధిస్తున్నారని అన్నారు. 24 గంటల పాటు డ్యూటీ చేయిస్తున్నారని, సీనియర్ల వేధింపులపై పలుమార్లు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేసి వారి నాన్న ఎస్ఐ కావడంతో అతని పేరు చెప్పి ప్రీతిని వేధించారని సోదరుడు ఆరోపించారు. నిన్న ఉదయం గుర్తుతెలియని ఇంజక్షన్ తీసుకొని ప్రీతి ఆత్మహత్యయత్నాలు పాల్పడిందని కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతానికి ప్రీతి కోమాలో ఉందని, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నాడు. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని వైద్యులు అంటున్నారని, ప్రీతి వ్యవహారాన్ని మేనేజ్మెంట్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Medico Preethi Father: ఇష్యూని డైవర్ట్ చేయడానికే నిమ్స్ కి తీసుకొచ్చారు

Show comments