NTV Telugu Site icon

Harish Rao: చంద్రబాబు అరెస్టు పై స్పందించిన హరీష్‌ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ మంచిది కాదని తెలిపారు. గతంలో అయిన ఐటీ ఐటీ అన్నాడు కానీ ఇప్పుడు చాలా మంచి మాట చెప్పాడని అన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారని మంత్రి తెలిపారు. కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం పూర్తి అయ్యేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మగౌరవం, ఆదాయం పెంచిన నాయకుడు అని అన్నారు.

Read also: Minister KTR: రెండు సార్లు మంత్రి కావడానికి కారణం ఆ పేరే..!

కాగా.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైందన్నారు. శిశు గృహలో అనాధ శిశువులను హరీష్ రావు పరిశీలించారు. ఈ క్రమంలో 3 నెలల చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడింది. అక్కడకు వెళ్లిన మంత్రి స్వయంగా తన చేతిల్లో తీసుకుని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టారు. శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విధంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా పెంచాలని అన్నారు. శ్రీజ ఆనందంగా పెరిగి పెద్దదై నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.
Minister KTR: బ్రేకింగ్‌.. భద్రాచలంలో భారీ వర్షం.. కేటీఆర్ పర్యటన రద్దు