Minister Harish rao tribute to professor Jayashankar
తెలంగాణ భవన్‌లో నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సైతం సిద్ధిపేటలో ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళి. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం..యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయం. సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఫోటోలను పంచుకున్నారు.
మంత్రి కేటీఆర్.. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం.. మీరు గడిపిన జీవితం మహోన్నతం..స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న. ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు.. జోహార్ Prof. జయశంకర్ సార్.. అని ట్విట్టర్ వేదిక కేటీఆర్ నివాళులు అర్పించారు.