NTV Telugu Site icon

Harish Rao Meet Tummala Nageswara Rao: రంగంలోకి హరీష్‌రావు.. మాజీ మంత్రి తుమ్మల ఇంటికి హరీష్‌

Harish Rao

Harish Rao

Harish Rao Meet Tummala Nageswara Rao: ఖమ్మం రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్‌ తొలి సభకు సిద్ధం అవుతోన్న వేళ.. బీఆర్ఎస్‌కు గండి కొట్టే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.. ఎవరు ఉంటారు? ఎవరు బైబై చెప్పేస్తారు? అనే టెన్షన్‌ కొనసాగుతున్నాయి.. అయితే, ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి హరీష్‌రావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు.. ఇది రాజకీయాల్లో కొత్త పరిణామానికి దారితీస్తుందని అంటున్నారు విశ్లేషకులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందించిన మంత్రి హరీష్ రావు ఈరోజు తన పర్యటనలో తుమ్మల నాగేశ్వరావు ఇంటికి వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే, గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరావు పార్టీకి మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఇదే సందర్భంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా పార్టీని వదిలేసినట్లు స్పష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పాలేరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరావు కూడా యోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టి తన బల ప్రదర్శనను తుమ్మల నాగేశ్వరరావు చేశారు. ఈ నేపథ్యంలో రేపు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉండగా అదేవిధంగా ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.. ఇక, బీఆర్ఎస్‌ సభని విజయవంతం చేసేందుకోసం ఖమ్మం జిల్లాకి సభ ఇన్చార్జిగా హరీష్ రావు ని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించాడు. హరీష్ రావు ఆధ్వర్యంలో ఖమ్మానికి ఒక టీం వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు డైరెక్ట్‌గా తుమ్మల నాగేశ్వరావు ఇంటికి వెళ్లడం జరిగింది.

దమ్మపేట మండలంలోని గండుగలపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీష్ రావు మరో మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు తీసుకొని వెళ్లటం రాజకీయాల్లో చర్చనీఅంశంగా మారింది. ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరావు ఇంటికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు వెళ్ళటం ఏం జరుగుతుందో అన్న చర్చ సాగుతుంది.. ఇక, బీఆర్ఎస్‌ తొలి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.