Harish Rao: నర్సాపూర్ టికెట్ లొల్లిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కార్యకర్తలు హరీష్ రావు ఇంటికి రావడంతో వెంటనే స్పందించిన మంత్రి బయటకు వచ్చారు. కార్యకర్తలు, అభిమానులు శాంతంగా ఉండాలని సూచించారు. ఆవేశ పడవద్దని, అందరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎవరి ఏ శాఖ ఇవ్వాలో సీఎం కేసీఆర్ కి తెలుసని, ఎవరూ ప్రలోభాలకు వెళ్లొద్దని మంత్రి అన్నారు. ఎవరు ఎటువంటి ఉద్వేగానికి లోనుకాకుండా శాంతంగా ఉండాలని అన్నారు. ఈ విషయం ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో క్యాడర్ శాంతించింది.
Read also: Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని ఆయన బంధువులు కోరుతున్నారు. హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు ఇంటి ముందు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. మదన్ రెడ్డికి బీఆర్ ఎస్ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. బీఆర్‌ఎస్ ప్రకటించని నాలుగు స్థానాల్లో నర్సాపూర్ ఒకటి. బీఆర్‌ఎస్ టికెట్ రాకపోతే రాజీనామా చేస్తానని మదన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్‌ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలోని బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు మదన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెల 21న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. ఈ జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆర్. అయితే నర్సాపూర్ టికెట్ మదన్‌రెడ్డికి కేటాయించాలని ఆ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు డిమాండ్ చేశారు. మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Lifestyle : మగవాళ్ళు ఈ తప్పులు చేస్తే ఆడవారికి అస్సలు నచ్చవట..ఎందుకంటే?