NTV Telugu Site icon

Harish Rao: రైతులు అధైర్య పడొద్దు.. పరిహారం ఇస్తాం

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసిన రైతుకు తక్కువే అని అన్నారు. రైతులు అధైర్య పడొద్దని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఓ నెల ముందే వరి నాట్లు వేసుకుంటే ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చని మంత్రి అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు.

Read also: Bomb Threat: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా మంత్రి హరీశ్‌ రావ్‌ పంట పొలాల్లోకి వెళ్లి నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు నీటమునిగిన పంటలను పరిశీలించారు. రైతుల బాధలు కనుగొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రైతులు మంత్రితో మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నీల్లపాలైందని వాపోయారు. పంట కోతకు వచ్చిందని సంబరపడేలోగానే అకాల వర్షాలకు పంట నాసనమైందని అన్నారు. అప్పు చేసి పంటలు వేస్తే ఇలా నడిరోడ్డుపై నిలవాల్సిన పరిస్తితి వచ్చిందని, మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం మీద భరోసాతోనే ధైర్యంగా ఉంటున్నామని, ప్రభుత్వం ఆదుకోకపోతే చావే సరణ్యమని వాపోయారు.
Electric Car: చౌకైన చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..