NTV Telugu Site icon

Harish Rao: 44 ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి 56 టిఫా మిషన్లు

Harishrao

Harishrao

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి భారీగా ఖర్చుచేస్తోందన్నారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ స్కాన్‌) దోహదం చేస్తుంది. ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే155 ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు ఉన్నాయి. నెలకు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయి. టిఫా స్కాన్‌ వల్ల మాత్రమే ఇలాంటివి గుర్తించగలుగుతాం. ఇందుకు గాను, 20 కోట్ల రూపాయలతో 56 టిఫా మిషన్లు సమకూర్చుకున్నాం. దీని కోసం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము.

ప్రైవేటులో టిఫా స్కాన్‌కు రూ. 2000-3000 వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. గర్బిణులకు18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్‌ చేస్తారు. గర్బంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్‌ చేస్తారు.

తెలంగాణ ఏర్పడ్డ నాడు కేవలం 200 ఐసీయూ పడకలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 6వేలకు పెంచుకున్నాం. నిమ్స్‌లో ఇప్పటికే 1800 పడకలు ఉండగా, రూ. 1571 కోట్లతో మరో 2000 పడకలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. 4వేల పడకలతో నగరం నలువైపులా 4 టిమ్స్‌, వరంగల్‌ లో 2000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో మరో 10వేల ఆక్సిజన్‌ పడకలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. 1569 పల్లె దవాఖాన పోస్టులు (MLHP) రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి అయ్యింది. డాక్టర్ల కొరత లేకుండా చూసుకునేందుకు, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 969 పీహెచ్‌సీ డాక్టర్లను భర్తీ చేస్తున్నాం అన్నారు.

వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో అనవసర సి-సెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. సాధారణ ప్రసవాలు పెరిగాయి.ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 3 లక్షల 60వేల ప్రసవాలు జరిగాయి. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 61.41శాతం సి సెక్షన్లు జరగగా, ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 54.49 శాతానికి తగ్గింది. అంటే ఏడాది కాలంలో దాదాపు 7శాతం సి సెక్షన్ల రేటు తగ్గింది.: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టిప్పా స్కానింగ్ సెంటర్ ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ వ్యాప్తంగా 56 ప్రాంతాలలో టిప్పా స్కానింగ్ సెంటర్లు ప్రారంభం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం పై అధికంగా ఖర్చుపెడుతున్నాం అనీ, పేదలు ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి తలసాని.

Read Also: Harish Rao: 44 ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి 56 టిఫా మిషన్లు

Show comments