Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి.. మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైందన్నారు. శిశు గృహలో అనాధ శిశువులను హరీష్ రావు పరిశీలించారు. ఈ క్రమంలో 3 నెలల చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడింది. అక్కడకు వెళ్లిన మంత్రి స్వయంగా తన చేతిల్లో తీసుకుని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టారు. శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విధంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా పెంచాలని అన్నారు. శ్రీజ ఆనందంగా పెరిగి పెద్దదై నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.
తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని మంత్రి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల శ్రీజను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుండి చిన్నారిని తీసుకొని లీగల్ గా శిశు గృహలో చేర్పించి అలనా పాలన చూస్తున్న వీరందరి అభినందించారు. చిన్నారులను కంటిరెప్పలా కాపాడాలని సూచించారు. శ్రీజ చిరునవ్వు ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో బ్యాంకు సేవలు ఉంటాయని తెలిపారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
Tamilisai: మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది..! గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!