Site icon NTV Telugu

విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు

సంగారెడ్డిలోని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, పటాన్‌ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తుల హాజరయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. విద్యపై ప్రత్యేక దృష్టితో ఎక్కువ నిధులను కేటాయిస్తున్న ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్‌ అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై అమితమైన అభిమానం చూపిన సబితా ఇంద్రారెడ్డి ప్రేమను మరువలేం, బయటకు ఎలా ఉన్నా లోపల మాత్రం ఉద్యమాలకు ఊతమిచ్చే వారని హరిష్‌ రావు అన్నారు.

Read Also: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డైమండ్స్ పట్టివేత

అనాధ పాఠశాల నిర్మాణానికి తమ వంతుకృషి చేస్తామని మంత్రి తెలిపారు. నిరుపేదలకు నెలనెల పెన్షన్లు అందించిన భూపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బాలికల హస్టల్, డిగ్రీ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తామని వెల్లడించారు. రాయసముద్రం చెరువును సిద్ధిపేట లోని కోమటి చెరువుకు ధీటుగా తయారుచేస్తామని మంత్రి వెల్లడించారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గురుకుల పాఠశాలల ద్వారా దేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యపై పెట్టిన పెట్టుబడి భావితరాల భవిష్యత్తు, మనుగడ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి వెల్లడించారు.

Exit mobile version