Site icon NTV Telugu

Harish Rao: నడ్డా జీ.. మీ హామీలు ఏమయ్యాయి? హరీశ్ రావ్ ట్వీట్ వార్

Harish Rao Tweet

Harish Rao Tweet

Harish Rao: జేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 2016 లో ఇచ్చిన మీ హమీలు ఏమయ్యాయి? అంటూ ట్వీట్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మీరు ఇచ్చిన హమీ హామీలు ఇప్పటికి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్ లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు మంత్రి హరీశ్‌ రావు. ఇక చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది.

Read also: Somu Veerraju: ఏపీలో రాహుల్ పాదయాత్రపై బీజేపీ అభ్యంతరం

మరి కేటాయించి కూడా ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హమీ ఇచ్చారు మరి ఆపనులు ఏమయ్యాయని నడ్డాపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి హరీశ్‌ రావు. అబద్దపు హమీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారు అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం అంటూ ట్వీటర్‌ వేదికగా బీజేపీ నడ్డాపై ప్రశ్నల వర్షం కురిపించారు.


Biopic: విశ్వనాథ సత్యనారాయణగా ‘ఆహా’ అనిపిస్తానంటున్న ఎల్బీ శ్రీరామ్!

Exit mobile version