బ్యాంకర్లపై సర్కార్ సీరియస్.. రైతుబంధు సొమ్ము తిరిగి జమ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు పంట సాయం కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుంటే.. ఇదే అదునుగా పాత బకాయిలను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు.. దీంతో.. ప్రభుత్వం సాయం చేసినా.. రైతులు పంటపెట్టుబడి పెట్టలేని పరిస్థితి.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు.. ఇక, సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. కానీ, రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లుకు స్పష్టం చేవారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్‌రావు.
also read : తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
Also Read
ఇక, ఇప్పటికే రైతు బంధు సొమ్మును నిలిపివేసిన లేదా సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు మంత్రి హరీష్‌రావు.. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.
తాజావార్తలు
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
-
IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!