NTV Telugu Site icon

అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదు: గంగుల కమలాకర్‌


ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడంతో మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌జిల్లాలో ఎస్‌ ఆర్‌ఆర్‌ కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బలపర్చిన భానుప్రసాద్, ఎల్. రమణలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలను ఎన్నికల వరకు తీసుకెళ్లారన్నారు. 1324 ఓట్లలో 1063 ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడ్డాయన్నారు.

ఇతర పార్టీల ఓట్లు 324 ఉండగా 934 ఓట్లు టీఆర్‌ఎస్‌వి ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ మీద కడుపు మంటతో అక్రమ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఓ అభ్యర్థిని పెట్టారని ఆయన విమర్శించారు. కేసీఆర్ బలగము, బలం చూపించలేదని కేవలం క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే ఏంటో నిరూపించామన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థికి ఉన్న 324 ఓట్లలో ఎన్ని పడ్డాయో తెలుస్తుందన్నారు.105 బీజేపీ ఓట్లు ఎవ్వరికి పడ్డాయి. బండి సంజయ్ అభ్యర్థిని పెట్టలేదు అంటే ఈటెల అభ్యర్థిని పెట్టమన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఓట్లు 86 ఓట్లు టీఆర్‌ఎస్‌ కు క్రాస్‌ అయ్యాయన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసిన చరిత్ర ఒక్క కరీంనగర్‌లోనే నెలకొందని విమర్శించారు. తెలంగాణ గడ్డమీద ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. రెండు ఎన్నికల్లో సునాయాసంగా గెలిపించిన ప్రజా ప్రతినిధులకు గంగుల ధన్యవాదాలు తెలిపారు.

మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ, భాను ప్రసాద్
ఎమ్మెల్సీగా మూడో సారి గెలిచిన భానుప్రసాద్‌ కేసీఆర్‌, కేటీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌ సమిష్టి విజయమని పేర్కొన్నారు. రెండు స్థానాలు మెదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం ఆనందం కలిగించిందన్నారు. నాపై అనేక దుష్ప్రచారం చేశారు..అయినా ప్రజా ప్రతినిధులు నాకు మద్దతు ఇచ్చారని వారికి ఎల్లప్పుడు రుణ పడి ఉంటానన్నారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ, రమణ
ఎమ్మెల్సీగా గెలిచిన ఎల్‌. రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియ జేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో నిరంతరం నిబద్ధతతో పనిచేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లా అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.