NTV Telugu Site icon

ఆత్మగౌరం ఈటలకే కాదు ప్రజలందరికీ ఉన్నది

నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేసినట్లు హుజురాబాద్ జరిగిన సమావేశంలో గంగుల కమలాకర్ అన్నారు. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినే. నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుండి బీడుభూములు లేకుండ చేసారు కెసిఆర్. గతంలో పంటలు పండక పోవడంతో ఇంటి తలుపులు తీసుకుపోయాయి బ్యాంకులు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేది. 24 గంటల కరెంటు తెలంగాణ లో తప్ప దేశం లో ఎక్కడ లేదు. రైతులకు భద్రత కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

ఇక ఎన్నికలు కోరుకున్నది ఈటల రాజేందర్… నల్లచెట్టలను వ్యతిరేకించిన ఈటల ఈరోజు అదే బీజేపీ లో చేరిండు. ఆత్మగౌరం ఈటల కె కాదు ప్రజలందరికీ ఉన్నది. వ్యక్తి గత ఆస్తులు పెంచుకోవడం తప్ప అభివృధి మీద దృషి పెట్టలేదు. టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్టు కెసిఆర్ గెలిచినట్టు. గెల్లు శ్రీనివాస్ లో కెసిఆర్ ని చూడండి అభివృద్ధిని చుడండి అని పేర్కొన్నారు.