Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : అలా చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గు లేదా..

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టని అగ్నిపథ్‌ పథకంపై విమర్శులు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరుగుతున్నాయని, అయిన కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరమన్నారు. నిరుద్యోగ యువత అంటేనే బీజేపీ నాయకులు చిన్నచూపు చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష, 40 వేలు ఉద్యోగాలు ఇచ్చిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.

డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే సామాన్యడు పై భారం పడిందని, యుద్ధం చేసి సైనికుల చనిపోతే ఆ సిపంతిపై రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ.. సైనికులుగా పని చేద్దాం అన్నా వాళ్ళను మోసం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. నల్ల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమించారని, సైనికులు, రైతులను మోసం చేస్తుంది బీజేపీ పార్టీ అని మంత్రి మండిపడ్డారు. రెండేళ్ల పాటు శిక్షణ పొంది రాకేష్ ఊరిలో జాబ్ వస్తాది అని చెప్పుకున్నాడని, ఇప్పటికైనా రాకేష్ కుటుంబాన్ని, ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా యువత శాంతి యుతంగా పోరాటం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version