Site icon NTV Telugu

MIM, Telangana Assembly Election: నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం.. అభ్యర్థులు వీరే..

Mim

Mim

MIM, Telangana Assembly Election: చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. గతంలో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చార్మినార్‌లో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషాను మజ్లిస్ పార్టీ యాకుత్ పురాకు మార్చింది. అక్కడ నాలుగోసారి గెలిచారు. అహ్మద్ ఖాన్ 1994లో ఎంబీటీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మజ్లిస్‌లో చేరి వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ నేత అహ్మద్ ఖాన్ 32,886 ఓట్ల తేడాతో బీజేపీ నేత ఉమా మహేంద్రపై గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మహ్మద్ గౌస్ కు 15,700 ఓట్లు వచ్చాయి.

2018 ఎన్నికల్లో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53,808 ఓట్లు రాగా, ఉమా మహేంద్రకు 21,222 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి మజ్లిస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చార్మినార్ వద్ద రెండుసార్లు విజయ ఢంకా మోగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ టీడీపీ నేత ఎంఏ బాషిత్‌పై విజయం సాధించారు. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి 62,941 ఓట్లు రాగా, టీడీపీ నేత ఎంఏ బాషిత్‌కు 26,326 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఏడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు:

* నాంపల్లి – మాజిద్ హుస్సేన్
* మలక్‌పేట – బలాల
* కార్వాన్ – మొహిద్దీన్
* చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్
* బహదూర్‌పురా – మహమ్మద్ ముబీన్
* చార్మినార్ – మీర్ జుల్ఫికర్ అలీ
* యాకుత్ పురా – జాఫర్ హుస్సేన్

Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం.. జిల్లాలకు ఎల్లో అలెర్ట్

Exit mobile version