NTV Telugu Site icon

Tigers Wandering: ఇదిగో పులి..వణుకుతున్న ఆదిలాబాద్ జనం

Adilabad

Adilabad

Tigers Wandering: పులుల సంచారం జనంలో భయాందోళనరేకెత్తిస్తోంది..వరుసబెట్టి పశువులపై పంజా విసురుతుండడంతో జనం వణికిపోతున్నారు..ఎక్కడ ఎటు వైపు నుంచి వచ్చి విరుచుక పడుతుందోనని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ మండలం తాంసీ కేశివారులో మళ్లీ పులి కనిపించింది. కొద్ది రోజులు అక్కడే మకాం వేసింది. మొన్న హాత్తిఘాట్ కెనాల్ లో రెండు పులులు కనిపించడంతో ఒ వ్యక్తి దానిని తన కెమరాలో బంధించాడు. ఇప్పుడు తాంసి కే శివారు పిప్పల్ కోఠి రిజర్వాయర్ పని ప్రదేశంలో పులి కనిపించింది. టిప్పర్ వెనకాల రోడ్డు దాటుతుండగా ఓ వాహన దారుడు ఫొటో తీశాడు. దీంతో అక్కడ పనిచేసే వర్కర్స్, శివారు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Read also: Child Save Many Lives: 18 నెలల చిన్నారి.. చాలా మంది ప్రాణాలను కాపాడింది..

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనే బజార్ హత్నూర్, తలమడుగు మండలాల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి సంచరిస్తుందని బజార్ హత్నూర్ మండలంలోని ఆవులమందపై దాడి చేసిన పులి ఓ ఆవును చంపేసింది. తలమడుగు మండలంలో పల్సిబి శివారులో పులిదాడిలో ఎద్దు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారంతో అక్కడకు చేరుకున్న అధికారులు చనిపోయిన ఎద్దు కుచులాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నకు చెందిందిగా గుర్తించారు. పులి సంచారం నిజమేనని సాయంత్రం, ఉదయం వేళల్లో అటవీ ప్రాంతాల వైపు వెల్లవద్దని పోలీసులు హెచ్చరించారు..ఈరెండు జిల్లాల్లో పులుల సంచారం, పశువులపై పడి చంపేస్తుంటే రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం పులి రక్షణతోపాటు జనం రక్షణ కోసం చర్యలు చేపట్టుతున్నట్లు చెప్పుతున్నారు. కొద్దిరోజుల క్రితం కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్ పరిదిలో పులుల సంచారం పెరిపోతుంది. మరీ ముఖ్యంగా కాగజ్ నగర్ మండలం వేంపల్లి, కోసిలి, అనుకొడ ప్రాంతాల్లో వారం రోజులుగా పులుల సంచరిస్తున్నాయి. అంతేకాదు వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే 8 పశువులను చంపేసిన పులి తాజాగా మండలం కోసిని బెస్ క్యాంప్ పక్కన అటవిలో ఎద్దు పై దాడి చేసింది.పులి దాడి లో ఎద్దు తీవ్రగాయాలో ఇంటికి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Harish Rao: మోడీ వ్యాఖ్యలకు హరీష్ రావ్ ఘాటైన రిప్లై