NTV Telugu Site icon

Metro Train Stopped: మళ్లీ మెరాయించిన మెట్రో.. ఈసారి ఎల్బీనగర్ వైపు..

Metro Train Stopped

Metro Train Stopped

Metro Train Stopped: మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజైల్ లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో ఈ ఘటన అసలు ఏం జరుగుతుందో అంటూ కంగారు పడ్డారు. త్వరగా వారి గమ్య స్థానానిక చేరుకునేందుకు మెట్రో ఎక్కితే ఇలాంటి లోపాలు మాటి మాటికి తెలెత్తడం ఏంటి అంటూ నిరాస చెందారు. అయితే మెట్రోలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించేందుకు సాయశక్తుల ప్రయాత్నించినా ఫలితం దక్కలేదు. మెట్రో రైలు కదలేందుకు ససేమిరా అనడంతో.. చేసేది ఏమీ లేక అధికారులు ప్రయాణికులను మెట్రో నుంచి దింపివేశారు.

Read also: Brahmotsavam in Karimnagar: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కరీంనగర్‌.. వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు

కొద్దిసేపు ఏంజరుగుతుందో ప్రయాణికులకు అర్థం కాలేదు. అయితే సాంకేతిక లోపంలో మెట్రో ముందుకు కదలడం లేదని కావున ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా మరో మెట్రోను సిద్దం చేసినట్లు మైకుల్లో ప్రకటించారు. ప్రయానికులు అందరిని వేరే మ్రెటోలో మరో ట్రైన్ లో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గమ్యస్థానానికి త్వరగా చేరుకుందామనే లోపే ఇలా జరగడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో లో ఇలా మాటి మాటికి సాంకేతిక లోపాలు తలెత్తడం ఏంటని మండిపడ్డారు. ఇది ఇలా జరగడం ఇది మొదటి సారి కాదని అంతకు ముందుకూడా ఇలా సాంకేతిక లోపాలతో మెట్రో ఆపివేసిన ఘటన చాలానే ఎదుర్కొవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలని ఎన్ని సార్లు చెప్పిన అసలు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments